Header Banner

మెడికల్ విద్యార్ధులకు అలర్ట్.. నీట్ పీజీ పరీక్ష వాయిదా…! కారణం ఇదే!

  Tue Jun 03, 2025 07:56        Education

దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పీజీ ప్రవేశాల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ పీజీ పరీక్ష వాయిదా వేసింది. సింగిల్ షిఫ్ట్ లోనే పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలే ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. నీట్ పీజీ పరీక్ష జూన్ 15న జరగాల్సి ఉంది. అయితే ఎంబీబీఎస్ తో పాటు డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు రెండు షిఫ్ట్ లకు బదులుగా ఒకే షిఫ్ట్ లో పరీక్ష నిర్వహించాలని దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ కు ఒకే షిప్ట్ లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది.

దీంతో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సింగిల్ షిఫ్ట్ లో పరీక్ష నిర్వహణ సాధ్యం కాకపోవడంతో బోర్డు ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించింది. సుప్రీంకోర్టు నిర్ణయం అమలు చేయాలంటే పలు మార్పులు చేయాల్సి ఉంటుందని ప్రకటన విడుదల చేసింది.


ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!


పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచడం, అభ్యర్థులందరికీ ఒకేసారి వసతి కల్పించడానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలను పేర్కొంది. ఈమేరకు నీట్ పీజీ పరీక్ష పారదర్శకంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా పరీక్షలు వాయిదా వేసినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ తెలిపింది.

NEET PG exam

త్వరలోనే నీట్ పీజీ పరీక్షల కొత్త తేదీ వెల్లడిస్తామని పేర్కొంది.జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షల్లో అక్రమాలపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పారదర్శకత ఉండాలంటే సింగిల్ షిఫ్ట్ లో పరీక్షలు నిర్వహిచాలని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే సురక్షితమైన పరీక్షా కేంద్రాల్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్ట్ లో నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. ఇందుకు అనుగుణంగానే ఇవాళ పీజీ పరీక్షల్ని వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #NEETPG2025 #NEETPGPostponed #MedicalStudentsAlert #NEETUpdate #ExamPostponed #NEETNews #MedicalAspirants